Home Covid 19 గణనీయంగా తగ్గిన కరోనా కేసులు : కేంద్రం

    గణనీయంగా తగ్గిన కరోనా కేసులు : కేంద్రం

    299
    0
    One plus R value in 8 states a major concern: Health Ministry
    One plus R value in 8 states a major concern: Health Ministry

    గణనీయంగా తగ్గిన కరోనా కేసులు : కేంద్రం భారతదేశంలో కోవిడ్ -19 కేసులు గణనీయంగా తగ్గాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంబంధిత వివరాలను వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ లో గరిష్టంగా రోజుకు నాలుగు లక్షలు నమోదయ్యే స్థాయి నుంచి, ప్రస్తుతం దేశంలో రోజుకు 30 వేలు మాత్రమే నమోదవుతున్నాయని పేర్కొన్నారు. గత 24 గంటల్లో 30,549 కేసులు దేశంలో నమోదయ్యాయని, ఇది గణనీయమైన తగ్గుదల అని చెప్పారు. గత వారం భారతదేశంలో నమోదయిన మొత్తం కేసులలో కేరళ రాష్ట్రానిది 40.95 శాతమని, ఆ తర్వాత మహారాష్ట్ర 19.43 శాతం, కర్ణాటక 5.94 శాతమని వివరించారు.
    జిల్లాల వారీగా కోవిడ్ డేటాను విశ్లేషిస్తూ, జూన్ మొదటి వారంలో మొత్తం 279 జిల్లాల్లో 100కి పైగా కేసులు నమోదయ్యాయని అగర్వాల్ చెప్పారు. అయితే, ఒక నెల తరువాత, అటువంటి జిల్లాల సంఖ్య 107కి పరిమితమైందని వివరించారు. ప్రస్తుతం 57 జిల్లాలు మాత్రమే 100 కి పైగా కేసులను నివేదిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 18 జిల్లాలలో గత నాలుగు వారాల నుండి కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఇందులో కేరళ నుండి 10, మహారాష్ట్ర నుండి 3, మణిపూర్ నుండి 2, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం నుండి ఒక్కొక్క జిల్లాలు ఉన్నట్లు పేర్కొన్నారు. రోజువారీ కోవిడ్ కేసుల్లో 47.5 శాతం ఈ 18 జిల్లాలు నుంచే వస్తున్నాయని వెల్లడించారు. కేరళలోని 10 జిల్లాలలో 40.6 శాతం కోవిడ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు.
    భారతదేశంలో యాక్టివ్ కేసుల సంఖ్యా గణనీయంగా తగ్గిందాని, ప్రస్తుతం 4 లక్షల వద్ద ఆ సంఖ్య ఉందని తెలిపారు. కేరళలో 1.65 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 10,000 కి పైగా కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. కేరళ మరియు మహారాష్ట్రలలో మాత్రమే మొత్తం 60 శాతం కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని ఆయన చెప్పారు. రికవరీ రేటు 97.3 శాతంగా ఉండడటం సానుకూల పరిణామన్నారు. మొత్తంగా, గత ఐదు రోజుల్లో 5 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు ఇవ్వబడ్డాయని వివరించారు. ఆర్ విలువలు (పునరుత్పత్తి) గురించి మాట్లాడుతూ, “పరిమిత సంఖ్యలో పునరుత్పత్తి విలువలు పెరగడాన్ని తాము గమనించినట్లు అగర్వాల్ తెలిపారు. మొత్తంగా, ఎనిమిది రాష్ట్రాలు 1. కంటే ఎక్కువ పునరుత్పత్తి రేట్లు చూపించాయని ఆయన అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో పెరుగుతున్న ఆర్ విలువలపై ఆందోళన వ్యక్తం చేశారు.

    For latest News

    Previous articleఐఎస్ఎస్ లో ప్రమాదం.. తప్పిన ముప్పు
    Next articleటోక్యో ఒలింపిక్స్ : బాక్సింగ్ లో కాంస్యం సాధించిన లవ్లీనా