Home సినిమాలు కొండపొలం ఫస్ట్ లుక్.. సరి కొత్తగా వైష్ణవ తేజ్

కొండపొలం ఫస్ట్ లుక్.. సరి కొత్తగా వైష్ణవ తేజ్

246
0
Kondapolam Movie First Look Released
Kondapolam Movie First Look Released

కొండపొలం ఫస్ట్ లుక్.. సరి కొత్తగా వైష్ణవ తేజ్ ఉప్పెనతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్న పంజా వైష్ణవ్ తేజ్.. ప్రస్తుతం విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘కొండపొలం’ సినిమా చేస్తున్నాడు. ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వైష్ణవ తేజ్ తో ఆడి పాడనుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను శుక్రవారం విడుదల చేశారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన కొండపోలం అక్టోబర్ 8 న థియేటర్లలో విడుదల కానుంది, అటవీ నేపథ్యంలో సాగే ఈ చిత్రం సాహసోపేతమైన చిత్రంగా నిలిచింది.

విలక్షణమైన కథలతో.. తన సినిమాలను హృద్యంగా, సందేశాత్మకంగా రూపొందించే దర్శకుడుగా క్రిష్ జాగర్లమూడి పేరొందారు. రకుల్ ప్రీత్ ఈ సినిమాలో తొలి సారిగా డీ గ్లామరైజ్ గా కనిపించనుంది. తెలంగాణలోని వికారాబాద్ అడవులలో కొండపొలం సినిమాను చిత్రీకరించారు. ముందుగా నివేదించినట్లుగా, రకుల్ ఈ చిత్రంలో డి-గ్లామ్ అవతారంలో ప్రేక్షకులకు సరి కొత్త రూపంలో దర్శనమివ్వనుంది. కొండపొలం సినిమా ప్రకృతి యొక్క ప్రాముఖ్యతను.. మానవులు భూమి వనరులను ఎలా దోచుకుంటారో చెప్పనుంది.

ఆగస్ట్ 20న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, కొండపోలం టైటిల్‌ను మేకర్స్ ఆవిష్కరించారు. వైష్ణవ్ తేజ్ నటించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని ప్రేక్షకులతో పంచుకున్నారు. పోస్టర్‌లో వైష్ణవ్ తేజ్ తీక్షణంగా చూస్తూ కనిపిస్తున్నాడు. చుట్టూ అందమైన ప్రకృతి, పచ్చని చెట్లతో అలరారే కొండాకోనలు దర్శనమిస్తున్నాయి. చిత్రం యొక్క ట్యాగ్‌లైన్‌లో ‘ఒక పురాణ గాథ’ అని ఉంది.

ఎన్టీఆర్ తర్వాత

కథానాయకుడు ఎన్టీఆర్, మహానాయకుడు ఎన్టీఆర్ సినిమాలను క్రిష్ జాగర్లమూడి గతంలో రూపొందించారు. అద్భుతంగా తెరకెక్కించినప్పటికీ, భావోద్వేగాలు అనుకున్నంతగా పండకపోవడంతో ఆశించిన ఫలితాలు రాలేదు. అనంతరం వైష్ణవ్ తేజ్ హీరోగా కొండపొలం చిత్రాన్ని ఆయన రూపొందిస్తున్నారు. కొండపోలం షూటింగ్ కొన్ని నెలల క్రితం పూర్తయింది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. కొండపోలంలోని సాంకేతిక బృందంలో సంగీత దర్శకుడుగా ఎంఎం కీరవాణి, సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ విఎస్, ఎడిటర్ శ్రవణ్ కటికనేని, కళా దర్శకుడు రాజ్ కుమా గిబ్సన్, కాస్ట్యూమ్ ఐశ్వర్య రాజీవ్ ఉన్నారు.

Previous articleపంజాబ్ కాంగ్రెస్ భవన్ లో మంత్రులు కూర్చోవాలి : సిద్ధూ ప్రతిపాదన
Next articleముగ్గురు పిల్లల విధానానికి చైనా ఆమోదం