Home ఆంధ్ర ప్రదేశ్ కెసిఆర్ కు రోజా దావత్.. ఏదో జరిగిందంటున్న ప్రతిపక్షాలు!

కెసిఆర్ కు రోజా దావత్.. ఏదో జరిగిందంటున్న ప్రతిపక్షాలు!

151
0
Roja Vs Revanth
Roja Vs Revanth

కృష్ణా జలాల పంపకంలో తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇరు రాష్ట్రాలకు చెందిన నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణకు చెందిన మంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని నీటి దొంగ అని విమర్శిస్తే, వైఎస్ ను అన్న వారికి పుట్టగతులు ఉండవంటూ అంతే స్థాయిలో అటువైపు నుంచి కౌంటర్లు వచ్చాయి. ఈ క్రమంలో ఈ అంశంపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ గతంలో కెసిఆర్ కు రోజా దావత్ ఇచ్చిన వైనంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తిరుపతి దైవదర్శనానికి వెళ్లి, నగరి ఎమ్మెల్యే రోజా ఇచ్చిన దావత్ లో ఆమె పెట్టిన రాగి సంకటి, నాటుకోడి పులుసు తిని, బలిసి.. బేసిన్లు లేవు.. భేషజాలు లేవని కెసిఆర్ అన్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఒకసారి నాటుకోడి పులుసు తిని రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామని అన్న కెసిఆర్.. నీళ్ల కోసమే 1200ల మంది బలిదానాలు చేసుకున్నారనే విషయం మరిచారన్నారు. ఆ రోజు దావత్ లోనే కృష్ణా నీళ్ల కోసం జగన్-కెసిఆర్ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా సదరు దావత్ పై అనుమానాలు వ్యక్తం చేశారు. రోజా పెట్టిన రొయ్యలు తిన్న కెసిఆర్.. కృష్ణా నీళ్లను ఏపీకి రాసిచ్చేశారని చెప్పారు.

నువ్వుటీడీపీ కోవర్టువి.. రేవంత్ పై రోజా విసుర్లు
తాను కెసిఆర్ కు దావత్ ఇస్తే లేని పోని విమర్శలు చేస్తున్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ లో టీడీపీ కోవర్టుగా పనిచేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. తనను విమర్శించే ముందు కెసిఆర్ కు చంద్రబాబు 28 వంటకాలతో విందు ఇచ్చిన విషయాన్ని మరిచిపోవద్దని హితవు పలికారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని.. ఆయన పేరు కోవర్టు రెడ్డి గా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు.
అయితే కృష్ణా నీళ్ల విషయంలో సంయమనంతో వ్యవహరించాల్సిన ఇరు రాష్ట్రాల నాయకులు వ్యక్తిగత విమర్శలకు పోతుండటంతో ఇది దేనికి దారి తీస్తుందోనని ప్రజలు ఆందోళనలో ఉన్నారు.

Previous articleజికా వైరస్.. కేరళలో కొత్త టెన్షన్
Next articleకరీనా కపూర్ మూడో బిడ్డ ఎవరో తెలుసా..