Home జాతీయ వార్తలు కావేరి నదిపై కర్నాటక ప్రాజెక్టు.. తమిళనాడు ఫైర్

కావేరి నదిపై కర్నాటక ప్రాజెక్టు.. తమిళనాడు ఫైర్

110
0
Karnataka Vs Tamil Nadu Over Cauvery Drinking Water Project
Karnataka Vs Tamil Nadu Over Cauvery Drinking Water Project

మేకెదాతు వద్ద కావేరి నదిపై తాగునీటి ప్రాజెక్టును నిర్మించాలనే కర్ణాటక ప్రణాళికలు చేపట్టింది. ఇది కాస్త దాని పొరుగు రాష్ట్రం తమిళనాడుతో ఉద్రిక్తతకు దారితీసింది. నది నీటిని పంచుకోవడం దశాబ్దాలుగా పొరుగు రాష్ట్రాల మధ్య ఇబ్బందికరంగా మారుతోంది. ఏవైనా వివాదాలు తలెత్తితే ఇరు రాష్ట్రాలకు చెందిన రాజకీయ పక్షాలు నిరసనలు, దాని వాళ్ళ హింస చెలరేగడం వంటి ఘటనలు ఇరు రాష్ట్రాలు చవిచూశాయి.

కావేరి నదిపై తాగు నీటి ప్రాజెక్టు నిమిత్తం కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఈ నెల మొదట్లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్ కె స్టాలిన్ కు లేఖ రాశారు. తాము నిర్మించనున్న ప్రాజెక్టు పై చర్చలకు ఆహ్వానించారు. తద్వారా అపోహలు తొలగుతాయని పేర్కొన్నారు. ప్రజల తాగునీటి అవసరాల కోసం నిర్మిస్తున్న ప్రాజెక్టుకు సహకరించాలన్నారు. తమ అభ్యర్థనను పరిశీలించి తమిళనాడు ప్రభుత్వం ఈ ప్రాజెక్టు అమలును వ్యతిరేకించదని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు సహకరిస్తే ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయన్నారు. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందిస్తూ కర్ణాటక ఈ ప్రాజెక్టును అమలు చేయరాదని, ఇది తన రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని స్పష్టం చేశారు.

కర్ణాటక ప్రభుత్వం తలపెట్టిన తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి అక్కడ ప్రతిపక్షం కాంగ్రెస్ మద్దతు పలికింది. ముఖ్యమంత్రి యడ్యూరప్ప నిర్ణయాన్ని సమర్ధిస్తూ కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్ ట్వీట్ చేశారు. ఇక తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వామిగా కాంగ్రెస్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో కావేరి నదిపై కర్ణాటక తలపెట్టిన తాగునీటి ప్రాజెక్టుపై తమిళనాడు కాంగ్రెస్ స్పందన ఎలా ఉంటుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Previous articleసెప్టెంబర్ నుంచి సీరంలో స్పుత్నిక్ ఉత్పత్తి
Next article2026 ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ భారత్ లో..