Home క్రీడలు కాంస్యం తప్పక సాధిస్తాం : భారత హాకీ స్టార్ మన్ దీప్ సింగ్

కాంస్యం తప్పక సాధిస్తాం : భారత హాకీ స్టార్ మన్ దీప్ సింగ్

360
0
we will prepare for bronze medal match - India hockey star Mandeep Singh
we will prepare for bronze medal match - India hockey star Mandeep Singh

కాంస్యం తప్పక సాధిస్తాం : భారత హాకీ స్టార్ మన్ దీప్ సింగ్ప్ర పంచ చాంపియన్ బెల్జియంపై భారత హాకీ జట్టు పలు తప్పిదాలు చేసిందని, ఫలితంగా మంగళవారం సెమీ ఫైనల్‌లో 2-5 ఓటమి చెందామని భారత హాకీ స్టార్ మన్ దీప్ సింగ్ అంగీకరించాడు. మొదటి రెండు క్వార్టర్స్ లో ఆధిపత్యం సాధించిన భారత జట్టు కీలక సమయంలో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వడంతో భారీ మూల్యం చెల్లించామని చెప్పాడు.
టోక్యో ఒలింపిక్స్‌లో ఓయి హాకీ స్టేడియంలో మంగళ వారం ప్రపంచ ఛాంపియన్‌ బెల్జియంపై 2-5 తేడాతో భారత్ హాకీ జట్టు పరాజయం పాలైంది. దాదాపు 49 సంవత్సరాల తర్వాత భారత హాకీ జట్టు ఒలింపిక్స్ లో సెమి ఫైనల్ కి చేరుకుంది. హాకీకి పునర్వైభవం వచ్చిందని దేశం సంబరపడుతున్న వేళ సెమి ఫైనల్ లో భారత జట్టు పరాజయం పాలవ్వడం కొంత నిరాశకు గురి చేసింది. ఏమైతేనేం.. ప్రపంచ ఛాంపియన్ జట్లకు ముచ్చెమటలు పట్టించింది. సెమి ఫైనల్ వరకు దూసుకెళ్లి తమ సత్తాను చాటింది. సెమీస్ లో పరాజయం పాలైన కాంస్యం సాధించి తీరుతామని భారత హాకీ జట్టు చెబుతోంది.
ప్రపంచ స్థాయి డ్రాగ్-ఫ్లికర్ అలెగ్జాండర్ హెండ్రిక్స్ బెల్జియం తరుపున 3 గోల్స్ చేశాడు. భారతదేశం 14 పెనాల్టీ కార్నర్‌లను ప్రత్యర్థికి సమర్పించింది. ఫలితంగా దానికి మూల్యాన్ని చెల్లించింది. సెమీ-ఫైనల్ 3వ క్వార్టర్ ముగిసే సమయానికి 2-2 వద్ద పరిస్థితి ఒకింత మెరుగ్గానే ఉంది. అయితే చివరి 15 నిమిషాల్లో భారతదేశం పోరాట పటిమను ప్రదర్శించలేకపోయింది. ఫలితంగా స్వర్ణ పతక వేటలో సెమి ఫైనల్ తోనే ఆగిపోయింది.
పరాజయం తర్వాత స్టార్ ఆటగాడు మన్ దీప్ సింగ్ మాట్లాడుతూ, 2వ క్వార్టర్ లో భారతదేశానికి ఆధిక్యాన్ని అందించడానికి చాలా ప్రయత్నాలు చేసినట్లు చెప్పాడు. వర్షం పడే సమయంలో పెనాల్టీ కార్నర్‌ల మధ్య అత్యుత్తమ ప్రదర్శన చేసిన స్టార్ గోల్‌కీపర్ పిఆర్ శ్రీజేష్ కూడా తమ వైఫల్యాలను అంగీకరించాడు. ప్రపంచ ఛాంపియన్‌లతో పోరు ఎల్లప్పుడూ కష్టంగానే ఉంతుందని వ్యాఖ్యానించాడు. కాంస్య పతకం కోసం ఆగస్టు 5 న ఆస్ట్రేలియా-జర్మనీల మధ్య జరిగే 2వ సెమీ ఫైనల్‌లో ఓడిపోయిన వారితో భారత్ తలపడుతుంది.
టోర్నమెంట్‌లో అత్యధిక గోల్స్ సాధించిన అలెగ్జాండర్ హెండ్రిక్స్ (19 వ, 49 వ, 53 వ నిమిషాలు) హ్యాట్రిక్ గోల్స్ సాధించగా, లూయిక్ లూపెర్ట్ (2 వ నిమిషం), జాన్-జాన్ డోమెన్ (60 వ) కూడా బెల్జియం జట్టు తరుపున ఒక్కో గోల్ సాధించారు. భారత్ తరుపున హర్మన్ ప్రీత్ సింగ్ (7 వ), మన్ దీప్ సింగ్ (8 వ) ఒక్కో గోల్ సాధించారు. ఒలింపిక్స్‌లో ఫైనల్‌లో భారత్ చివరిసారిగా కనిపించింది 1980 మాస్కో గేమ్స్‌లో మాత్రమే. ఇప్పటి వరకు భారత్ ఒలింపిక్స్ లో ఎనిమిది స్వర్ణ పతకాలను గెలుచుకుంది.

For latest News

Previous articleజికా వైరస్.. మహారాష్ట్రకు కేంద్ర బృందం
Next articleపెగాసస్ : ప్రతిపక్షాలతో రాహుల్ గాంధీ సమావేశం