Home సినిమాలు కరోనా రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్న రజినీకాంత్

కరోనా రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్న రజినీకాంత్

103
0

తమిళ సూపర్ స్టార్ అయినప్పటికీ తెలుగులోను రజినీకాంత్ కు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ఆయన సినిమా అనగానే తెలుగులో కూడా కాసుల వర్షం కురుస్తుందని, తెలుగు హక్కులు కొనడానికి నిర్మాతలు ఏ మాత్రం వెనకడుగు వెయ్యరు. ఒకవేళ రజనీకాంత్ సినిమా వల్ల తెలుగు నిర్మాతలు నష్టపోతే, తిరిగి వారికి ఆ డబ్బును ఇచ్చేస్తారు. అంతటి గొప్ప మనసున్న మహానటుడు తెలుగు, తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన హీరోగా, నయన తార హీరోయిన్ గా స్టార్ దర్శకుడు శివ ” అన్నాత్తే ” అనే భారీ చిత్రాన్ని తెరకెక్కించడంలో నిమగ్నమై ఉన్న సంగతి తెలిసిందే ! గత కొన్నాళ్ల కితమే ఫస్ట్ డోస్ తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలిసిందే. అందుకే ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కూడా ఆల్రెడీ తమ టీకా తీసుకున్నారు. షూట్ లో పాల్గొన్న రజినీ నిన్ననే ఇక్కడ నుంచి చెన్నై బయల్దేరి కూడా వెళ్లిపోయారు. మరి అలా వెళ్లిన తలైవర్ ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా తన కోవిడ్ రెండో డోస్ టీకాను ఈరోజు వేయించేసుకున్నారు.     

Previous articleటీఎన్నార్ కుటుంబానికి ఐ డ్రీమ్ సంస్థ రూ.10 లక్షల ఆర్థికసాయం
Next articleల‌క్ష్మీరాయ్ గ్లామ‌ర్ ఫొటోల‌పై నెటిజ‌న్లు మండిపాటు