Home Covid 19 కరోనా అలెర్ట్ : డెల్టా వేరియంట్ తో మహారాష్ట్రలో ముగ్గురు మృతి

  కరోనా అలెర్ట్ : డెల్టా వేరియంట్ తో మహారాష్ట్రలో ముగ్గురు మృతి

  411
  0
  3 Deaths In Maharashtra From Delta+ Variant
  3 Deaths In Maharashtra From Delta+ Variant

  కరోనా అలెర్ట్ : డెల్టా వేరియంట్ తో మహారాష్ట్రలో ముగ్గురు మృతి డెల్టా ప్లస్ కోవిడ్ వేరియంట్ పంజా విసురుతోంది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు ముగ్గురు డెల్టా ప్లస్ వేరియంట్ తో మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ముంబయిలో ఓ మహిళ, రాయగఢ్ లో ఓ వృద్ధుడు, రత్నగిరిలో ఓ వృద్ధురాలు డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా మృతి చెందినట్లు తెలుస్తోంది.

  ఇప్పటికే కోవిడ్ మహారాష్ట్రను అల్లకల్లోలం చేసింది. వెల్లువలా నమోదైన కేసులతో ముంబై ఆసుపత్రులు కిటకిటలాడేవి. ప్రస్తుతం మహమ్మారి నెమ్మదించిందన్న తరుణంలో ప్రమాదకర డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదు కావడం అధికార, పాలక వర్గాల్లో కలవరం రేకెత్తించింది.

  ముంబై నగరంతో సహా మహారాష్ట్ర వ్యాప్తంగా ఆంక్షలు క్రమంగా తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ తరుణంలో జూలై 27న మరణించిన 63 ఏళ్ల మహిళ మృతి మొట్టమొదటి డెల్టా ప్లస్ మరణంగా తెలుస్తోంది.

  69 ఏళ్ల వృద్ధుడు కూడా రాయగఢ్‌లో డెల్టా ప్లస్ తోనే మరణించాడు. రత్నగిరికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు గత నెలలో ఇదే కారణంతో మరణించింది.

  జూలై 21 న పాజిటివ్ పరీక్షించిన ముంబై మహిళకు డయాబెటిస్‌తో సహా అనేక అనారోగ్య సమస్యలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆమె పూర్తిగా టీకాలు పొందింది. నగరంలోని ఏడుగురు రోగులలో డెల్టా ప్లస్ లక్షణాలు కనిపించాయి. ఏప్రిల్-మేలో కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభించిన విషయం తెలిసిందే.

  అనంతరం వేగంగా వ్యాపించే డెల్టా వేరియంట్ అక్కడి అధికారులను, ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల కొందరు ముంబై మహిళలు కోవిడ్ బారిన పడ్డారు. వారి నుంచి ముంబై కార్పొరేషన్ వైద్య అధికారులు నమూనాలను సేకరించి, జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. ఈ ఫలితాలు బుధవారం వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు డెల్టా ప్లస్ బారిన పడిన ఏడుగురు రోగులను సంప్రదించింది.

  డెల్టా ప్లస్ కోవిడ్ వేరియంట్ తో మృతి చెందిన మహిళా ఇద్దరు సన్నిహితులను కూడా పరీక్ష చేశారు. మృతి చెందిన మహిళ ఇటీవల కాలంలో ఎటువంటి ప్రయాణం చేయకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

  మహారాష్ట్ర వ్యాప్తంగా డెల్టా ప్లస్ వేరియంట్ కోసం ముంబై నుంచి ఏడు శాంపిల్స్‌తో పాటు మరో 13 శాంపిల్స్ పరీక్షించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మూడు కేసులు పూణేలో, రెండు చొప్పున నాందేడ్, గోండియా, రాయఘడ్, పాల్ఘర్‌లో ఉన్నాయి. చంద్రపూర్, అకోలాలో ఒక్కొక్కటి చొప్పున డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి. దీంతో డెల్టా ప్లస్ రోగుల సంఖ్య 65కి పెరిగింది.

  మ్యుటేషన్ చెందిన కోవిడ్ వేరియంట్ ఏడుగురు చిన్నారులు, ఎనిమిది మంది సీనియర్ సిటిజన్లలో కూడా కనుగొనబడింది. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు ఇటీవల సోకిన రోగులతో పరిచయం ఉన్న వ్యక్తులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.

  కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 86 కేసులలో డెల్టా ప్లస్ కనుగొనబడిందని బుధవారం ప్రకటించింది. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. డెల్టా ప్లస్ కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో నమోదయ్యాయి. తరువాత మధ్యప్రదేశ్, తమిళనాడులలో ఉనికి ఉన్నట్లు జాతీయ ఆరోగ్య నియంత్రణ కేంద్రం చీఫ్ సుజిత్ సింగ్ విలేకరులతో చెప్పారు.

  భారతదేశంలోనే తొలుత నమోదయిన డెల్టా వేరియంట్ కారణంగానే ఏప్రిల్-మేలో కరోనావైరస్ సెకండ్ వేవ్ వచ్చింది. ఇది దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాల లోపాలను ఎత్తి చూపింది. లక్షలాది మంది ఆసుపత్రి పడకలు, ఆక్సిజన్, మందులు, టీకా కోసం ప్రయత్నించి కొంత నిరాశకు గురయ్యారు.

  For more news

  Previous articleభారత ప్రభుత్వం దిగుమతి సుంకం తగ్గించేనా? టెస్లా నిరీక్షణ
  Next articleస్క్రాపేజ్ విధానంతో పాత వాహనాలు తుక్కుకే : మోడీ