Home సినిమాలు కరీనా కపూర్ మూడో బిడ్డ ఎవరో తెలుసా..

కరీనా కపూర్ మూడో బిడ్డ ఎవరో తెలుసా..

151
0
Kareena Kapoor Book Launched
Kareena Kapoor Book Launched

బాలీవుడ్ స్టార్ కపుల్ కరీనా కపూర్ – సైఫ్ అలీ ఖాన్ దంపతుల పిల్లలంటే నెటిజన్లకు విపరీతమైన ఆసక్తి. వీరి మొదటి కొడుకు తైమూర్ విషయానికొస్తే.. చిన్నప్పుడే సెలెబ్రిటీ అయిపోయాడంటే అతిశయోక్తి కాదు. ఎక్కడకు వెళ్లిన మీడియా ఆ చిన్నారి ఫొటో క్లిక్ మనిపించేవి. సోషల్ మీడియాలో అయితే తైమూర్ ఫొటోకు లైకుల వర్షం కురిసేది. అంతలా కరీనా కుమారుడికి క్రేజ్ ఉంది. ఈ దంపతులకు ఫిబ్రవరిలో మరో కుమారుడు జన్మించాడు. మరి అంతలోనే మూడో బిడ్డా.. ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా.. అయితే అసలు విషయం మీరు తెలుసుకోవాల్సిందే..

ఇటీవల బాలీవుడ్‌ ప్రముఖ హీరోయిన్‌ కరీనా కపూర్‌ ఖాన్‌ తాను రచించిన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. దీనికి ‘ప్రెగ్నెన్సీ బైబిల్‌’ అనే పేరు పెట్టారు. ఆ పుస్తకం తనకు మూడో బిడ్డలాంటిదని అన్నారు. పుస్తకానికి సంబంధించిన విషయాలను ఇన్ స్టాగ్రామ్ లో వీడియోను అభిమానులకు పోస్ట్ చేశారు. తాను గర్భిణిగా ఉన్న సమయంలో ఎదుర్కొన్న జీవితాన్ని గురించి అందులో పేర్కొన్నారు. ఆమె పుస్తకానికి
స్త్రీ వైద్య నిపుణులు, ప్రసూతి వైద్యుల అధికారిక సంస్థ ప్రశంశలు, అనుమతి లభించడంపై సంతోషం వ్యక్తం చేశారు.

Previous articleకెసిఆర్ కు రోజా దావత్.. ఏదో జరిగిందంటున్న ప్రతిపక్షాలు!
Next article‘ఉక్కు’ సంకల్పంతో.. ఉధృతంగా..