Home క్రీడలు ఒలింపిక్ క్రీడాకారులపై యూపీ సీఎం కానుకల వర్షం

ఒలింపిక్ క్రీడాకారులపై యూపీ సీఎం కానుకల వర్షం

194
0
Yogi govt presents Rs 42 crore monetary award to Olympians
Yogi govt presents Rs 42 crore monetary award to Olympians

ఒలింపిక్ క్రీడాకారులపై యూపీ సీఎం కానుకల వర్షం ఇటీవల ముగిసిన టోక్యో గేమ్స్‌లో దేశం గర్వించదగ్గ ఒలింపియన్లను సత్కరించేందుకు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు పథకాలు సాధించిన క్రీడాకారులకు గురువారం 42 కోట్ల రూపాయలను ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న యూపీకి చెందిన 10 మంది అథ్లెట్లకు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అదనంగా రూ.25 లక్షల నగదు బహుమతిని అందజేశారు.

బంగారు పతక విజేత నీరజ్ చోప్రా రూ.2 కోట్లు, రజత పతక విజేత రవి దహియా, లిఫ్టర్ మీరాబాయి చాను రూ .1.5 కోట్లు అందుకున్నారు. ముగ్గురు వ్యక్తిగత కాంస్య పతక విజేతలు షట్లర్ పివి సింధు, బాక్సర్ లవ్లినా బోర్గోహైన్, రెజ్లర్ బజరంగ్ పునియాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇచ్చారు. టోక్యోలో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల హాకీలో 19 మంది సభ్యులందరూ ఒక్కొక్కరికి కోటి రూపాయలు అందుకున్నారు.

టోక్యోలో నాల్గవ స్థానంలో నిలిచిన మహిళల హాకీ జట్టు సభ్యులకు కూడా ఆయన నగదు ప్రోత్సాహం అందించారు. ఒక్కొక్కరికి రూ .50 లక్షలు బహుమతిగా అందజేశారు. ఎన్నో ఆశలు రేకెత్తించి.. తృటిలో కాంస్య పతకాన్ని కోల్పోయిన గోల్ఫర్ అదితి అశోక్ కూడా నగదు బహుమతి అందుకున్నారు.

ఒలింపిక్ ఈవెంట్‌లో భారతదేశ క్రీడాకారుల అత్యుత్తమ ప్రదర్శనను ఆదిత్యనాథ్ ప్రశంసించారు. కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ దేశానికి తమ అత్యుత్తమ సేవలను అందించిన క్రీడాకారులను ప్రశంసించారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల బృందం అత్యుత్తమ ప్రదర్శనను అందించినందుకు సంతోషిస్తున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. 18 విభాగాలలో పోటీ పడిన భారతదేశం 7 పతకాలు సాధించిందన్నారు. యుపి నుండి 10 మంది అథ్లెట్లు కూడా టోక్యో క్రీడల్లో పాల్గొన్నారని, వారు తమ ప్రతిభతో దేశానికి వన్నె తెచ్చారని ఆదిత్యనాథ్ అన్నారు.

ఉత్తర ప్రదేశ్‌లో క్రీడలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే 31 స్టేడియాలను నిర్మించామని, మీరట్‌లో స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతోందని గుర్తు చేశారు. దీనికి ప్రముఖ హాకీ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ పేరు పెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.

Previous articleవిపక్ష నేతలతో రేపు సోనియా వర్చువల్ సమావేశం
Next articleపంజాబ్ కాంగ్రెస్ భవన్ లో మంత్రులు కూర్చోవాలి : సిద్ధూ ప్రతిపాదన