Home అంతర్జాతీయ వార్తలు ఒలింపిక్స్.. జరిగి తీరుతాయి : ఐఒసి అధ్యక్షుడు థామస్ బాచ్

ఒలింపిక్స్.. జరిగి తీరుతాయి : ఐఒసి అధ్యక్షుడు థామస్ బాచ్

181
0
Tokyo Olympics
Tokyo Olympics

ఒలింపిక్ ఎట్టి పరిస్థితుల్లోను జరిగి తీరుతాయని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) అధ్యక్షుడు థామస్ బాచ్ ప్రకటించారు. కరోనా కారణంగా స్టేడియాలలోకి ప్రేక్షలును అనుమతించేది లేదని జపాన్ ప్రభుత్వం ప్రకటించడం, మహమ్మారి తీవ్రత దృష్ట్యా ఈ సారి క్రీడలు జరుగుతాయో లేదో అనే క్రీడాభిమానులు సందేహాలకు ఆయన ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ మేరకు ఒలింపిక్ గేమ్స్ టోక్యో 2020 కి ముందు అథ్లెట్లకు వీడియో సందేశం ఇచ్చారు. ఈయన ఫ్రాంక్‌ఫర్ట్ (జర్మనీ) నుంచి ఒలింపిక్ క్రీడలు జరగనున్న జపాన్ లోని టోక్యో చేరుకున్నారు. ఒలింపిక్ లో పాల్గొనే క్రీడాకారులందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ కచ్చితంగా వేస్తామని అన్నారు. ఒలింపిక్ క్రీడలను పూర్తి సురక్షిత వాతావరణంలో నిర్వహిస్తామని చెప్పారు.
ఒలింపిక్ క్రీడల సందర్భంగా టోక్యోలోని ఏ వేదికలలోనూ ప్రేక్షకులను అనుమతించరని ఇటీవలి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. టోక్యో మెట్రోపాలిటన్ ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయానికి తన మద్దతును ప్రకటించారు. ప్రేక్షకులు లేకపోవడం తీవ్ర లోటేనని, అందరి ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తప్పని సరి అయిందని చెప్పారు.

“ఇది ఒలింపిక్ క్రీడలను సురక్షితంగా నిర్వహించడానికి అవసరమైన నిర్ణయం. అందువల్ల ఐఓసి మరియు ఐపిసి రెండూ ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చాయి” అని ఐఓసి అధ్యక్షుడు శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. “ఈ ఒలింపిక్ క్రీడలు జరుగుతున్నాయని, మీ ఒలింపిక్ కలను మీరు నిజం చేసుకోగలరని మేము అందరం అంగీకరిస్తున్నామని నేను నమ్ముతున్నాను.” అంటూ క్రీడాకారులను ఉద్దేశించి వీడియోలో ఆయన వ్యాఖ్యానించారు.

“ఈ ఆటలు నిజంగా ప్రత్యేకమైన పద్ధతిలో ప్రపంచం ముందుకు తీసుకొస్తాం. 9 వేల గంటలకు పైగా ఒలింపిక్ లో క్రీడలను నిర్వహించే రికార్డును త్వరలో చేరుకోనున్నాం. టోక్యో ఒలింపిక్స్-2020 మిమ్మల్ని ప్రపంచానికి చూపించేందుకు గొప్ప సదవకాశాన్ని ఇవ్వనుంది. ఒలింపిక్స్ ను చూసేందుకు ప్రపంచం అంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోంది. ఈ స్టేడియాలలో మీరు ఒంటరిగా అనుభూతి చెందాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు టివి తెరలకు అతుక్కుపోతారు. వారు మీ హృదయాలలో ఉంటారు” అంటూ క్రీడాకారులకు బాచ్ తన సందేశాన్ని అందించారు.
“మీ ప్రజలందరూ, మీ కుటుంబం, మీ స్నేహితులు మరియు మీ మద్దతుదారులయిన ప్రజలందరి నుండి మీరు గొప్ప మద్దతును అందుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ మనకు టోక్యో స్వాగతం పలుకుతోంది. ఒలింపిక్ గేమ్స్ టోక్యో 2020 కోసం త్వరలో ఇక్కడ కలుద్దాం” ” అంటూ తన సందేశాన్ని ముగించారు.

Previous articleనేనూ.. లవ్ ఫెయిల్యూర్ నే : అనుపమ పరమేశ్వరన్
Next articleకరీనా రెండో కుమారుడి పేరిదే..