Home రాజకీయం ఒబిసి బిల్లులో మార్పులు అవసరం : శరద్ పవార్

ఒబిసి బిల్లులో మార్పులు అవసరం : శరద్ పవార్

240
0
Will pressurise Centre to change OBC Bill, need caste-based census: Sharad Pawar
Will pressurise Centre to change OBC Bill, need caste-based census: Sharad Pawar

ఒబిసి బిల్లులో మార్పులు అవసరం : శరద్ పవార్ కేంద్రం ఇటీవల ముగిసిన వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో ఆమోదించిన ఓబిసి బిల్లుకు మార్పులు అవసరమని ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్ అన్నారు. పార్లమెంట్ లో ఆమోదం పొందిన రాజ్యాంగం 127వ సవరణ బిల్లుపై విమర్శలు చేసిన ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్ సవరణకు వ్యతిరేకంగా ప్రజల ఏకాభిప్రాయాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. 50 శాతం కోటా పరిమితి ఇప్పటికీ ఉన్నందున, రాష్ట్రాలు తమ వెనుకబడిన కులాలను జాబితా చేసే అధికారాన్ని మళ్లీ పొందాయనే అభిప్రాయం తప్పుదోవ పట్టిస్తుందని పవార్ అన్నారు.

ఈ సవరణ.. ప్రజలను విందుకి ఆహ్వానించి, ఆపై చేతులు కట్టుకుని తినమని కోరడం లాంటిదని ఎన్‌సిపి చీఫ్ వ్యాఖ్యానించారు. ఇది ఒబిసి కమ్యూనిటీని మోసం చేస్తోందన్నారు. దేశంలో కుల ఆధారిత జనాభా గణన అవసరమని పవార్ సోమవారం విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సవరణలో మార్పులు చేయాల్సిందిగా తాము కేంద్రంపై ఒత్తిడి చేస్తామన్నారు. పార్లమెంటులో ఈ అంశంపై తీవ్రంగా చర్చించలేదని చెప్పారు. ఈ సవరణ పరిణామాలను చాలా మంది ఎంపీలు అర్థం చేసుకోలేదన్నారు. బిజెపి నాయకులలో ఒక వర్గం కుల ఆధారిత ఏకాభిప్రాయానికి అనుకూలంగా ఉన్నారని, అయితే ప్రధాని నరేంద్ర మోడీ ముందు తమ అభిప్రాయాన్ని చెప్పడానికి మరింత ధైర్యం అవసరమని పేర్కొన్నారు.

రాజ్యాంగం 127 వ సవరణ బిల్లు – 2021, రాష్ట్రాలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించడం, నోటిఫై చేయడం ద్వారా తమ స్వంత ఒబిసిల జాబితాను రూపొందించే అధికారాన్ని తిరిగి రాజ్యసభలో 187-0 మెజారిటీతో ఆమోదించింది. బిల్లుపై సభ్యులెవరూ అభ్యంతరం చెప్పనప్పటికీ, కుల గణన లేకపోవడంపై ప్రతిపక్షాలు కొన్ని ఆందోళనలు లేవనెత్తాయి. రిజర్వేషన్ల కోసం రాష్ట్రాలపై 50 శాతం పరిమితిని తొలగించాలని డిమాండ్ చేశాయి.

Previous articleటెక్ న్యూస్…
Next articleలూసిఫర్ రీమేక్ లో సల్మాన్ ఖాన్ ?