Home జాతీయ వార్తలు ఒబిసి బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

ఒబిసి బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

501
0
Parliament passes bill to give states power to make their own OBC Lists
Parliament passes bill to give states power to make their own OBC Lists

ఒబిసి బిల్లుకు పార్లమెంట్ ఆమోదం రాష్ట్రాలకు ఒబిసి జాబితాలను రూపొందించడానికి అధికారం కట్టబెట్టే బిల్లును పార్లమెంట్ బుధవారం ఆమోదించింది. ఇక నుంచి రాష్ట్రాలు తమ స్వంత వెనుకబడిన కులాల (OBC) జాబితాలను రూపొందించుకునే అధికారాన్ని పునరుద్ధరించడానికి రాజ్యాంగ (127 వ సవరణ) బిల్లు, 2021 ని బుధవారం రాజ్యసభ ఆమోదించింది. విపక్ష సభ్యుల ఏకగ్రీవ మద్దతుతో బిల్లు నిన్న లోక్ సభ ఆమోదం పొందింది. ఇది ఇప్పుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం కోసం ఈ బిల్లు వెళ్లనుంది.

బిల్లుపై చర్చ సందర్భంగా, ఎగువ సభలో కొంతమంది విపక్ష సభ్యులు రిజర్వేషన్ మరియు కుల గణనపై 50 శాతం పరిమితిని తీసివేయడం, గరిష్ట ప్రయోజనాలను పొందేందుకు ఆవశ్యకతను వివరించారు. బిల్లుపై చర్చలో పాల్గొన్న ఎస్‌పి నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ మాట్లాడుతూ రిజర్వేషన్‌పై 50 శాతం పరిమితిని తొలగించినప్పుడు మాత్రమే ఒబిసిలు ఈ బిల్లు ద్వారా గరిష్ట ప్రయోజనాన్ని పొందుతారని చెప్పారు. అణగారిన వర్గాలకు ఈ చట్ట సవరణ ప్రయోజనాన్ని అందించడానికి కుల ఆర్థిక గణన అవసరమని ఆయన పేర్కొన్నారు. బిల్లు ఆమోదం పొందిన తరువాత, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు వర్గాలను – యాదవులు, కుర్మీలు మరియు గుజ్జార్‌లను ఉత్తర ప్రదేశ్‌లోని ఓబిసిల జాబితా నుండి తొలగిస్తాయని ఊహాగానాలు చెలరేగుతున్నాయని యాదవ్ సభకు తెలిపారు.

విద్యాసంస్థలలోని ఖాళీల గురించి కూడా ఎస్‌పి నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ సూచించారు. 2020 ఆగష్టు 1 నాటికి 40 సెంట్రల్ యూనివర్సిటీలలో 313 ఒబిసి రిజర్వడ్ ప్రొఫెసర్ పోస్టులున్నాయని, కేవలం తొమ్మిది మాత్రమే భర్తీ చేశారని చెప్పారు. ఇదే అభిప్రాయాలను ప్రతిబింబించేలా జెడి(యు)కు చెందిన రామ్ నాథ్ ఠాకూర్ ప్రసంగం కూడా సభను ఆకట్టుకుంది. ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా, ఎన్‌సిపికి చెందిన వందనా చవాన్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ తదితరులు మాట్లాడుతూ కుల, ఆర్ధిక జన గణన ఆవశ్యకతను వివరించారు.

సిపిఎం నాయకుడు ఎలమరం మాట్లాడుతూ ప్రభుత్వం ఈ బిల్లును బలవంతంగా తీసుకువచ్చిందని అన్నారు. రిజర్వేషన్ కింద క్రైస్తవ దళితులను కవర్ చేయకూడదనే అంశాన్ని ఆయన లేవనెత్తారు.

For More News

Previous articleడెల్టా వేరియంట్ పై స్పుత్నిక్-వి ప్రభావం 83 శాతం : రష్యా
Next articleఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్య హత్యే : రాహుల్ గాంధీ