Home సినిమాలు ఏ… ఒకసారి చెప్తే అర్ధం కాదా? : ప్రకాష్ రాజ్ పై సీనియర్ నరేష్ సెటైర్

ఏ… ఒకసారి చెప్తే అర్ధం కాదా? : ప్రకాష్ రాజ్ పై సీనియర్ నరేష్ సెటైర్

159
0
tweet war between Naresh and Prakashraj
tweet war between Naresh and Prakashraj

తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల మొదలైన మా ఎన్నికలు సెగలు పుట్టిస్తున్నాయి. నటుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నువ్వా నేనా అంటూ సాగుతున్న ఈ ఎన్నికలు రాజకీయ రంగాన్ని తలపిస్తున్నాయి. వారం రోజులుగా సైలెంట్ గా ఉన్న వారంతా ఇప్పుడు మరో సారి తమ నోటికి పదును పెట్టారు.

మా ఎన్నిక వ్యవహారం గురించి కదుపుతూ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ “మా ఎన్నికలు ఎప్పుడు?” జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీటారు. దీనికి కౌంటర్ గా మా ప్రస్తుత అధ్యక్షుడు సీనియర్ నరేష్ కూడా ట్వీట్ చేశారు. ఏ.. ఒకసారి చెప్తే అర్ధం కాదా అనే రీతి లో సమాధానము ఇచ్చారు. మా ఎన్నికను సెప్టెంబర్ లో నిర్వహిస్తామని చెప్పినా, కొందరు అదే పనిగా అడుగుతున్నారని అన్నారు. వీరి తీరు చూస్తుంటే నీళ్లు లేకుండా స్విమ్మింగ్ పూల్ లో దూకాలా అని అడిగినట్లు ఉందని పేర్కొన్నారు. కరోనా కారణంగా ప్రస్తుతం మా ఎన్నికలు వాయిదా పడ్డాయని, పరిస్థితులు కుదుటపడిన వెంటనే జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించి సెప్టెంబర్ లో ఎన్నికలు జరుపుతామని వివరించారు.. ఏదేమైనా ఈ సారి మా ఎన్నికలు నటీనటుల మధ్య మాటల వేడిని పుట్టిస్తున్నాయి. అసోసియేషన్ ప్రారంభించిన తొలినాళ్లలో ఏకగ్రీవ ఎన్నికలు జరిగేవి. కొంత కాలంగా రెండు ప్యానళ్లుగా విడిపోయి ఎన్నికలలో తలపడ్డారు. ప్రస్తుతం మాత్రం ఐదుగురు మా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగడం ఆసక్తిగా మారింది. ఒకరిపై మరొకరు పైచేయి సాధించే విధంగా మాట్లాడుతుండటంతో మా ఎన్నికలు రక్తి కట్టిస్తున్నాయి.

Previous articleమోడీ టీంలో యువరక్తం
Next articleపెళ్లి పీటలెక్కనున్న నయన తార..?