Home ఆంధ్ర ప్రదేశ్ ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల

ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల

352
0
AP Inter Results Released
AP Inter Results Released

ఏపీలో ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. సుప్రీమ్ కోర్టు సూచనలకనుగుణంగా ఈ నెలాఖరు కంటే ముందుగానే తాము ఫలితాలను విడుదల చేశామన్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా విద్యార్థుల, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గతంలో పరీక్షలు వాయిదా వేశామన్నారు. పరీక్షలు రద్దయిన నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు ఫలితాల ప్రకటనలో ఒక్కో విధానాన్ని అనుసరించాయన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఒక హై పవర్ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఇందులో భాగంగా విశ్రాంత ఛాయా రతన్ నేతృత్వంలో సమగ్ర కమిటీ సూచించిన విధి విధానాలను ఆమోదిస్తూ ఫలితాలను విడుదల చేశామన్నారు. పది పరీక్షల్లో విద్యార్థికి అధికంగా వచ్చిన మూడు సబ్జెక్టుల సగటును తీసుకుని దానికి 30 శాతం వెయిటేజీ ఇచ్చామన్నారు. మిగిలిన 70 శాతానికి మొదటి సంవత్సరం లో విద్యార్థులు సబ్జెక్టుల వారీగా సాధించిన అన్ని సబ్జెక్టుల మార్కులను వర్తించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు ఇప్పటికే పూర్తయినందున వాటిని యథాతధంగా ఉంచామన్నారు. గతంలో ఫెయిల్ లేదా హాజరుకాని వారికి సాధారణ పాస్ మార్కులు వేశామన్నారు. ఈ విధానం నచ్చని వారికి కావాలంటే, పరిస్థితులు చక్కపడిన తర్వాత పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తామన్నారు.
ఇక ఫస్ట్ ఇయర్ పరీక్షలకు ఫీజు కట్టిన వారందరినీ సెకండ్ ఇయర్ లోకి ప్రమోట్ చేశామన్నారు.

ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను ‌http://examresults.ap.nic.in, http://results.bie.ap.gov.in, http://results.apcfss.in, http://bie.ap.gov.in వెబ్ సైట్ లలో చూడొచ్చు.

Previous articleనన్ను వ్యతిరేకించే వారి వల్లే నా ఎదుగుదల : పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సిద్ధూ
Next articleఅట్టహాసంగా.. టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం