Home Astrology ఈ రోజు రాశి ఫలాలివే…

ఈ రోజు రాశి ఫలాలివే…

101
0

మేషం
ఈ రోజు ప్రారంభించిన పనుల్లో అనుకున్నది సాధిస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇష్ట దేవతను ప్రార్ధిస్తే మరింత మేలు జరిగే అవకాశం ఉంది.

వృషభం
చేయాల్సిన పనులను క్రమ పద్ధతిలో పూర్తి చేస్తారు. వ్యయ ప్రయాసలు అధికంగా ఉండే అవకాశం ఉంది. మనది కాని వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. నారాయణ మంత్రం పటిస్తే బాధలు తొలగుతాయి.

మిథునం
సన్నిహితుల ద్వారా సాయం అందుతుంది. శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాలు కనుక ఉంటే అవసరమైన జాగ్రత్తలు పాటించాలి. దత్తాత్రేయ ఆరాధనతో మంచి ఫలితాలు లభిస్తాయి.

కర్కాటకం
ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితమైన నిర్ణయంతో ప్రయోజనం చేకూరుతుంది. బంధుమిత్రుల తోడ్పాటు లభిస్తుంది. ఇష్టమైన ఆహార పదార్ధాలను భుజిస్తారు. స్థిరాస్థి కొనుగోళ్లలో లాభాలు వస్తాయి. భగవంతుడిని ఇష్టపూర్వకంగా ఆరాధించడం మంచిది.

సింహం
దైవానుగ్రహంతో చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్వార్థ చింతనతో వ్యవహరిస్తారు. కీర్తి ప్రతిష్టలతో పాటు లక్ష్మి కటాక్షం పుష్కలంగా ఉంటుంది. లక్ష్మీదేవి ఆరాధన లాభదాయకం.

కన్య
చేయాల్సిన పనుల్లో అడ్డంకులు వస్తాయి. ఎవరి రంగాల్లో వారు నిబంధనలకు అనుగుణంగా ముందుకు సాగాలి. మంచి ఫలితాలు వస్తాయి. అతినమ్మకంతో చేటు కలుగుతుందని గుర్తించాలి. రామ నామ జపం శుభ ఫలితాన్ని ఇస్తుంది.

తుల
ఆపదలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఒక విషయం మిమ్మల్ని బాగా బాధిస్తుంది. ఆవేశాలకు పోతే అనర్ధాలు ఉంటాయి. లక్ష్య సిద్ధి కోసం లింగాష్టకాన్ని పఠించాలి.

వృశ్చికం
కుటుంబ సభ్యుల సహకారంతో చేసే పనులన్నీ విజయవంతమవుతాయి. అనుకున్న పని నెరవేరుతుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసివస్తాయి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. సాయి చరిత్ర పఠన లాభిస్తుంది.

ధనుస్సు
చేపట్టిన పనులన్నింటిలోనూ విజయం సాధిస్తారు. అధికారుల ప్రశంసలు ఉంటాయి. ఒక విషయం ఉత్తేజాన్ని ఇస్తుంది. సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు.ఇష్ట దైవ స్మరణ మంచిది.

మకరం
మీ నిజాయితీయే మీకు తగిన గుర్తింపును ఇస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం అవసరమైన విషయాల్లో లాభిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో మొహమాటంతో చేటు కలుగుతుంది. దుర్గామాత ధ్యానం శ్రేయోదాయకం.

కుంభం
మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. ఒత్తిడిని వీడితే మంచి ఫలితాలు ఉంటాయి. విభేదాలు వీడి బంధుమిత్రులను కలుస్తారు. కొన్ని సంఘటనలతో అమితానందం కలుగుతుంది. శివనామ స్మరణ మంచిది.

మీనం
అనుకున్న పని కచ్చితంగా నెరవేరుతుంది. సంతోషాన్ని కలిగింతే శుభవార్తలు వింటారు. ఇష్ట దైవనామ స్మరణతో మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి.

Previous articleకాఫీ తాగితే లాభమా? నష్టమా? | is coffee good for health or not?
Next articleటీపీసీసీ సారధిగా రేవంత్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ