Home ఆంధ్ర ప్రదేశ్ ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు ఏపీ సర్కారు శుభవార్త

ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు ఏపీ సర్కారు శుభవార్త

129
0
10 Percent Reservations to EWS in Andhra Pradesh
10 Percent Reservations to EWS in Andhra Pradesh

మీరు ఈడబ్ల్యూఎస్‌ పరిధిలోకి వస్తారా.. అయితే ఇది మీకు నిజంగా సంతోషం కలిగించే వార్తే. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు అడ్మిషన్లు, ఉద్యోగ నియామకాలు విషయంలో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈడబ్ల్యూఎస్‌ వర్తించే వారికీ అడ్మిషన్లు విషయంలో రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 లో ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ రిజర్వేషన్లను ఉద్యోగాలకు కూడా వర్తింపజేస్తూ తాజాగా ఉత్తర్వులు తీసుకుంది. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులను అమలు చేస్తూ బుధవారం జీవో జారీ చేసింది.

ఈడబ్ల్యూఎస్‌ పరిధిలోని వారికి ప్రయాజనాలివే..
అగ్రకులాలలో ఆర్ధికంగా వెనుకబడిన వారై ఉండాలి. కుటుంబ ఆర్ధిక ఆదాయం వార్షికంగా రూ.8 లక్షలలోపు ఉన్నవారు మాత్రమే దీని పరిధిలోకి వస్తారు.
ఉద్యోగ నియామకాలలో ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్ల కేటాయింపును ఏపీ సర్కారు చేపట్టనుంది.
వీరికి ఉద్యోగ నియామకాలలో కల్పించే 10 శాతం రిజర్వేషన్లలో 1/3 వంతు మహిళలకు చెందుతుంది.
ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ సర్టిఫికెట్లును తహశీల్దారు జారీ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
గతంలో ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్థులకు సుప్రీం ఆదేశాలతో 10 శాతం రిజర్వేషన్లను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కల్పించింది. అందులో ప్రత్యేకంగా 5 శాతం రిజర్వేషన్లను కాపు సామాజిక తరగతికి కేటాయించింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లను అగ్రకులాలలో అందరికీ సమానంగా వర్తిస్తు నిర్ణయం తీసుకుంది.

Previous articleపశ్చిమ బెంగాల్ లో పీఏసీ చిచ్చు.. గవర్నర్ తో సువేందు భేటీ
Next articleస్పేస్ టూరిజంలో జెఫ్ బెజోస్ చరిత్ర సృష్టిస్తారా?