Home జాతీయ వార్తలు ఆఫ్ఘన్ ప్రజలకు చేయూతపై కేంద్రం సమాలోచనలు

ఆఫ్ఘన్ ప్రజలకు చేయూతపై కేంద్రం సమాలోచనలు

440
0
CCS meets on next steps, PM says need to assist ‘Afghan brothers, sisters’
CCS meets on next steps, PM says need to assist ‘Afghan brothers, sisters’

ఆఫ్ఘన్ ప్రజలకు చేయూతపై కేంద్రం సమాలోచనలు తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకోవడంతో ఆ దేశ ప్రజలు ఇతర దేశాలకు కఠిన పరిస్థితుల్లో వలస వెళ్తున్నారు. ఈ క్రమంలో వారికి అవసరమైన సాయం అందించేందుకు భారత ప్రభుత్వం సమాలోచనలు చేస్తుంది. తాలిబన్లు కాబుల్ ను స్వాధీనంగా చేసుకోవడంపై రష్యా, చైనా, పాకిస్తాన్ లు మద్దతు తెలిపాయి. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన భద్రతపై కేబినెట్ కమిటీ (CCS) సమావేశం బుధవారం జరిగింది. రానున్న రోజుల్లో సహాయం కోసం భారతదేశం వైపు చూస్తున్న ఆఫ్ఘన్ సోదరులకు, సోదరీమణులకు భారతదేశం అన్ని విధాల సహాయాన్ని అందిస్తుందని సమావేశంలో ప్రధాని చెప్పారు.

“భారతదేశం.. మన పౌరులను కాపాడటమే కాదు, భారతదేశానికి రావాలనుకునే సిక్కు, హిందూ మైనారిటీలకు కూడా మేము ఆశ్రయం కల్పించాలి. అలాగే సహాయం కోసం భారతదేశం వైపు చూస్తున్న ఆఫ్ఘన్ సోదర సోదరీమణులకు మేము అన్ని విధాలా సహాయాన్ని అందించాలి” మోదీ చెప్పినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

సిసిఎస్ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

ప్రస్తుతానికి కాబూల్ పాలనలో అధికారిక నిర్మాణం కోసం భారత ప్రభుత్వం వేచి ఉంటుంది. అక్కడ వేగంగా మారుతున్న పరిస్థితుల దృష్ట్యా తాలిబాన్‌లతో సంప్రదించడం, వారు అధికారిక వ్యవస్థను నిర్మించడం పై వేచి చూడాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. తదుపరి చర్యలపై ముందుకు సాగడానికి ఢిల్లీ ప్రజాస్వామ్య దేశాలతో సన్నిహితంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఐఏఎఫ్ సి-17 గ్లోబ్‌మాస్టర్ విమానాన్ని కాబుల్ నుంచి యుఎస్ సహాయంతో తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని భారత రాయబారి రుద్రేంద్ర టాండన్ కూడా మంగళవారం కాబూల్ నుండి తరలించబడ్డారు.

అంతర్గత అధికార భాగస్వామ్యం, ఆఫ్ఘనిస్తాన్‌లో ఒక సమస్యగా ఉంటుందని అధికారులు తెలిపారు. తాలిబాన్లపై పాకిస్తాన్, చైనా ప్రభావం కూడా ఆందోళన కలిగించే అంశంగా అధికారులు అభిప్రాయపడ్డారు. తాలిబాన్లు తిరిగి రావడంతో పొరుగున ఉన్న ఉగ్రవాదులకు ధైర్యం వచ్చే అవకాశం ఉందని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. ప్రస్తుతం కాశ్మీర్ లోయలో పరిస్థితి అదుపులో ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Previous articleమార్కెట్ లో మోటరోలా స్మార్ట్ ఫోన్లు.. కళ్ళు చెదిరే ఫీచర్లు
Next articleసిబిఐకి స్వయం ప్రతిపత్తి ఉండాలి : మద్రాస్ హై కోర్టు