Home అంతర్జాతీయ వార్తలు ఆఫ్ఘనిస్తాన్ లో పాగా వేస్తున్న తాలిబన్లు.. పెరుగుతున్న అరాచకాలు?

ఆఫ్ఘనిస్తాన్ లో పాగా వేస్తున్న తాలిబన్లు.. పెరుగుతున్న అరాచకాలు?

415
0
Taliban Forcing Afghan Women To Marry Terrorists
Taliban Forcing Afghan Women To Marry Terrorists

ఆఫ్ఘనిస్తాన్ లో పాగా వేస్తున్న తాలిబన్లు.. పెరుగుతున్న అరాచకాలు? అమెరికా తన బలగాల ఉపసంహరణ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు పాగా వేస్తున్నారు. తాజాగా ఆఫ్ఘానిస్తాన్ రాజధాని కాబుల్ తర్వాత ఆ స్థాయి నగరం కాందహార్ ను తన ఆధీనంలోకి తీసుకున్నారు. దేశంలోని అనేక కీలక నగరాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ప్రాబల్యం పెరుగుతూ వస్తోంది. అయితే అక్కడ తాలిబన్లు చెబుతున్న దానికి, జరుగుతున్న దానికి పొంతన ఉండటం లేదని అంతర్జాతీయ మీడియా ఘోషిస్తోంది. తమ ఆధీనంలోని ఉన్న నగరాల్లో మహిళలను బలవంతంగా వివాహమాడటం, దొరికిన సైనికులను బహిరంగంగా ఉరి తీయడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు కథనాలు వస్తున్నాయి.

తాలిబాన్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలలో వారు పౌరులపై అప్రకటిత దాడులు చేస్తున్నారని తెలుస్తోంది. పట్టుబడిన సైనికుల మరణశిక్షలను చూశారని మీడియా చెబుతోంది. అంతేకాకుండా, అవివాహిత మహిళలను తమ ఉగ్రవాదులకు “భార్యలుగా” మార్చాలని తాలిబాన్లు డిమాండ్ చేశారని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ మేరకు సదరు విషయాలను మానవ హక్కుల సంఘాలు గురువారం ప్రకటించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ గురువారం ప్రచురించింది.

తాము విజయం సాధిస్తామని తాలిబాన్లు బహిరంగ ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వ అధికారులు, సైనికులు, ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కానీ వారి చర్యలు అందుకు విరుద్ధంగా ఉన్నట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం చెబుతోంది. లొంగిపోయిన ఆఫ్ఘన్ మిలిటరీ సభ్యులను తాలిబన్లు ఉరితీసినట్లు నివేదికలు అందాయని కాబూల్‌లోని యుఎస్ రాయబార కార్యాలయం తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ లో తాలిబాన్ల చర్యలు తీవ్ర ఆందోళన కలిగించే యుద్ధ నేరాలు కావచ్చు అంటూ ట్వీట్ చేసింది.

ఆఫ్ఘనిస్తాన్ లోని అనేక ముఖ్య నగరాలపై తాలిబాన్ నియంత్రణ సాధించింది. గవర్నర్ కార్యాలయం, ఇతర పరిపాలనా భవనాలను స్వాధీనం చేసుకున్న తర్వాత, దేశంలో రెండవ అతిపెద్ద నగరం కాందహార్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు గురువారం రాత్రి ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఇప్పటి వరకు, దేశంలో 12 ప్రావిన్షియల్ రాజధానులను టెర్రర్ గ్రూప్ స్వాధీనం చేసుకుంది. తాలిబాన్ మరియు వాషింగ్టన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా దళాలు వైదొలిగిన వెంటనే ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకొని, అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నంలో టెర్రర్ గ్రూప్ ఆఫ్ఘన్ ప్రభుత్వ బలగాలతో విస్తృతంగా పోరాడుతోంది.

Previous articleకలిసి పాలిద్దాం.. తాలిబాన్లకు ఆఫ్ఘన్ రాయబారం?
Next articleభారత ప్రభుత్వం దిగుమతి సుంకం తగ్గించేనా? టెస్లా నిరీక్షణ