Home జాతీయ వార్తలు ఆగస్టు 15న కాశ్మీర్ లో పేలుళ్లకు ఐఎస్ఐ కుట్ర

ఆగస్టు 15న కాశ్మీర్ లో పేలుళ్లకు ఐఎస్ఐ కుట్ర

327
0
Pakistan’s ISI hatches fresh terror plans ahead of August 15
Pakistan’s ISI hatches fresh terror plans ahead of August 15

ఆగస్టు 15న కాశ్మీర్ లో పేలుళ్లకు ఐఎస్ఐ కుట్ర: పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ భారత్ లో ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం నాడు పేలుళ్లకు కుట్ర పన్నిందని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లో కొత్త టెర్రర్ కంట్రోల్ రూమ్‌లను ఐఎస్ఐ ఏర్పాటు చేయడం ప్రారంభించింది. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు జమ్మూ కాశ్మీర్‌పై దాడులు చేయడానికి ఉగ్రవాద గ్రూపులతో సంప్రదింపులు జరిపి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు జమ్మూ కాశ్మీర్‌లో రక్తం పారించేందుకు ఐఎస్ఐ కొత్త ఉగ్ర దాడులను రూపొందించిందని భారత నిఘా వర్గాలు ఓ ఆంగ్ల పత్రిక కు తెలిపాయి. పిఒకెలో అనేక తీవ్రవాద గ్రూపులను ఐఎస్ఐ సంప్రదించిందని, ఆగస్టు 15 కి ముందు భద్రతా దళాలపై దాడులు చేయడానికి ప్రణాలికలను రూపొందించిందని తెలుస్తోంది. ఉగ్ర ముప్పు దృష్ట్యా జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాల్లో భారత భద్రతా దళాలు హెచ్చరికలు జారీ చేశాయి.
ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ ఏజెన్సీలు తయారు చేసిన నివేదిక ప్రకారం లష్కరే తోయిబా, జైష్-ఇ-మహ్మద్, పీఓకేలోని అల్-బద్రే మరియు ‘చెలబండి’ ముజాఫ్రాబాద్‌తో సహా నిషేధిత ఉగ్రవాద సంస్థల సీనియర్ కార్యకర్తల మధ్య వరుస సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలలో జమ్మూ కాశ్మీర్‌లోకి ఉగ్రవాదుల చొరబాటు కోసం సమన్వయంతో కూడిన ఉగ్రవాద దాడులు, కొత్త చొరబాటు మార్గాల ప్రణాళికలకు చర్చలు జరిగాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
జమ్మూ కాశ్మీర్‌లోకి చొరబడటానికి ఐఎస్ఐ కొత్త మార్గాలను వెతకడం, పిఒకెలో కొత్త కంట్రోల్ రూమ్‌లను కూడా ఏర్పాటు చేయడం భారత నిఘా వర్గాలు అప్రతమయ్యాయి. పాక్ యొక్క ఐఎస్ఐ, తీవ్రవాద గ్రూపులు నియంత్రణ రేఖ వెంబడి 8 కొత్త మార్గాల ద్వారా జమ్మూ కాశ్మీర్‌లోకి చొరబడాలని యోచిస్తున్నాయి.

For latest News

Previous articleటోక్యో ఒలింపిక్స్ : సెమీస్ కు భారత మహిళల హాకీ జట్టు
Next articleఆగస్టులోనే థర్డ్ వేవ్.. సెకండ్ వేవ్ కంటే తక్కువ ప్రభావం : అధ్యయనం లో వెల్లడి