Home విద్య ఆగస్టులో నోటిఫికేషన్ : ఏపీపీఎస్సీ

ఆగస్టులో నోటిఫికేషన్ : ఏపీపీఎస్సీ

194
0
APPSC More Posts in New Notification
APPSC More Posts in New Notification

లక్షల సంఖ్యలో నిరుద్యోగులు ఉండగా తక్కువ సంఖ్యలో పోస్టులతో గ్రూపు 1, 2 జాబులతో ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండరు ను విడుదల చేయడంపై విమర్శలు ఎదుర్కొన్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.. నిరుద్యోగుల ఆందోళనలతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. మరిన్ని పోస్టులు కేటాయించి గ్రూపు 1, 2 ఉద్యోగాలకు ఆగస్టు లో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు శుక్రవారం ఏపీపీఎస్సీ అధికారులు ప్రకటన విడుదల చేశారు. గ్రూపు 1, 2 ల తో పాటు వివిధ విభాగాలలో మరిన్ని ఖాళీలకు ఉద్యోగ ప్రకటన రానుంది. ఆగస్టు నాటికి వివిధ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో గుర్తించి, అప్పటి వరకు ఉన్న ఖాళీలకు నోటిఫికేషన్ రానుంది. ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్‌ సలాంబాబు సంబంధిత వివరాలను వెల్లడించారు. ఏపీపీఎస్సీ ప్రకటనపై దీనిపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా గ్రూపు 1, 2 నోటిఫికేషన్ లు ప్రతి ఏడాది విడుదల కావడం లేదు. ఐదేళ్లకు ఒకసారి మారే ప్రభుత్వాలు కేవలం ఒకటి రెండు సార్లు తక్కువ పోస్టులకు నోటిఫికేషన్ ప్రకటించి, చేతులు దులుపుకుంటున్నారు. ఈ క్రమంలో నిరుద్యోగులు వయోపరిమితి కారణంగా ఉద్యోగాలకు దరఖాస్తు అవకాశాన్ని కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో 47 ఏళ్లకు అభ్యర్థుల వయో పరిమితిని పెంచాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. పలు నిరుద్యోగ సంఘాలు ప్రభుత్వానికి లేఖలు పంపారు. దీనిపైనా ఏపీపీఎస్సీ అధికారులు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ అనుమతి రాగానే నోటిఫికేషన్ లో సంబంధిత ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా గ్రూపు 1, 2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూ లను రద్దు చేసిన ప్రభుత్వం, గ్రూపు 1 మినహా మిగిలిన పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్షలకు కూడా రద్దు చేసింది. ఇకపై కేవలం ఒకే పరీక్ష తోనే ఏపీపీఎస్సీ ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది. ఉద్యోగాల కోసం ఏపీపీఎస్సీ ముట్టడి కి గతంలో యత్నించిన నిరుద్యోగులపై పెట్టిన కేసులను ఉపసంహరించేలా చర్యలు తీసుకున్నట్లు ఏపీపీఎస్సీ అధికారులు వెల్లడించారు.

Previous articleకసరత్తు చేసిన తర్వాతే.. గెజిట్ విడుదల : సంజయ్‌ అవస్థి
Next articleకాక రేపుతున్న అమరీందర్ లేఖ : పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం?