Home జాతీయ వార్తలు అయోధ్య రామమందిరంలో భక్తుల ప్రవేశం.. 2023 డిసెంబర్ లోనే!

అయోధ్య రామమందిరంలో భక్తుల ప్రవేశం.. 2023 డిసెంబర్ లోనే!

476
0
Ayodhya's Ram temple to open its doors to devotees by December 2023
Ayodhya's Ram temple to open its doors to devotees by December 2023

అయోధ్య రామమందిరంలో భక్తుల ప్రవేశం.. 2023 డిసెంబర్ లోనే: హిందువులంతా ఎంతో భక్తిభావంతో ఎదురు చూస్తున్న అయోధ్య రామమందిరం నిర్మాణం శరవేగంగా పూర్తి కావస్తోంది. 2023 డిసెంబర్ లోనే భక్తులు ఆలయ ప్రవేశం చేసే అవకాశం ఉంది. అయితే ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి 2025 వరకు సమయం పడుతుందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్టు పేర్కొంది. గత ఏడాది ఆగస్టు 5 న జరిగిన వేడుకలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆలయానికి శంకుస్థాపన చేశారు. ప్రధాన ఆలయం కాకుండా, ఈ కాంప్లెక్స్‌లో మ్యూజియం, డిజిటల్ పురాతన పత్రాలు, పరిశోధన కేంద్రం కూడా ఉన్నాయి. ఆలయ ప్రాథమిక నిర్మాణం పూర్తయిన తర్వాత భక్తుల కోసం ఆలయ ప్రవేశం, పూజ కైంకర్యాలు ప్రారంభమవుతాయని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం తెలిపింది.
కర్ సేవక్ పురంలో కనీసం 70 శాతం రాళ్లను దేవాలయ నిర్మాణానికి వినియోగిస్తామని, నిర్మాణంలో ఉక్కు, ఇటుకలను ఉపయోగించట్లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆలయ దీర్ఘకాల మన్నికను నిర్ధారించడానికి పెద్ద సంఖ్యలో అధ్యయనాలు జరిగాయని, ఆధునిక, సాంప్రదాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని వారు తెలిపారు.

రెండవ దశ నిర్మాణం డిసెంబర్‌లో..
ఆలయ సముదాయం నిర్మాణాన్ని పర్యవేక్షించే ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపాత్ రాయ్ ఈ సంవత్సరం ప్రారంభంలో మీడియా సంస్థలతో మాట్లాడుతూ సుమారు రెండున్నర ఎకరాలలో రామ మందిరం నిర్మించబడుతుందని చెప్పారు. మూడేళ్లలో పని పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆలయం చుట్టూ ‘పార్కోటా’ అనే గోడ నిర్మించబడుతుందని, అంతేకాకుండా వరద నుండి ఆలయ ప్రాంగణాన్ని పరిరక్షించడానికి భూమి లోపల పునాదులను పటిష్టంగా నిర్మించనున్నట్లు వివరించారు. అక్టోబర్ చివరి నాటికి మొదటి దశ పూర్తవుతుందని, తరువాత రెండవ దశ ఈ సంవత్సరం డిసెంబరులో ప్రారంభమవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. యుపిలోని అయోధ్యలోని మొత్తం రామ దేవాలయ సముదాయాన్ని రూ.1,000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్టుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అసంఖ్యాక హిందువుల నుంచి ఇప్పటికే రూ.3000 కోట్ల విరాళాలు అందాయి. ఆలయం వెయ్యేళ్ళు నిలిచేలా నిర్మాణం చేపట్టనున్నారు. మరో ఏడాదిన్నరలోనే ఆలయంలో ప్రవేశం ఉంటుందనే వార్తలతో భక్తులు ఆనంద పారవశ్యంలో ఉన్నారు.

For Latest News

Previous articleసైబర్ అంతరిక్ష దాడులను ఎదుర్కొనే సాంకేతికత అవసరం : రాష్ట్రపతి కోవింద్
Next articleజయహో భారత్.. ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు