Home అంతర్జాతీయ వార్తలు అమ్రుల్లా సలేహ్.. ఆఫ్ఘన్ పోరాట యోధులకు కొత్త ఊపిరి

అమ్రుల్లా సలేహ్.. ఆఫ్ఘన్ పోరాట యోధులకు కొత్త ఊపిరి

172
0
Amrullah Saleh.. The Brave heart of Afghanistan
Amrullah Saleh.. The Brave heart of Afghanistan

అమ్రుల్లా సలేహ్.. ఆఫ్ఘన్ పోరాట యోధులకు కొత్త ఊపిరి తాలిబన్ల వరుస ఆక్రమణల తర్వాత ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని సులువుగా చేజిక్కించుకున్నారు తాలిబన్లు. ఈ తరుణంలో పోరాటం ఇంకా ముగియలేదని ఓ గొంతు గర్జించింది. దాని పేరే అమ్రుల్లా సలేహ్.. ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్థాన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఈయన తాలిబాన్లపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. తమ రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు లేకుంటే ఆ బాధ్యతలు ఉపాధ్యక్షునికి సంక్రమిస్తాయని చెబుతున్నారు. తనని తాను ఆఫ్ఘన్ అధ్యక్షునిగా ప్రకటించుకుని తాలిబాన్లపై పోరు సాగిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లోని 34 ప్రావిన్స్ లో ఒకే ఒకటి తాలిబన్ల ఆధీనంలో లేదు. అదే పంజ్ షేర్.. అక్కడ తాలిబన్లను తరిమికొట్టి, ఆఫ్ఘనిస్థాన్ సైనికులకు కొత్త ఊపిరిగా సలేహ్ మారారు.

ఆగస్టు 17న అమృల్లా సలేహ్ ఆఫ్ఘనిస్తాన్ రాజ్యాంగంలోని నిబంధనలను ఉదహరిస్తూ దేశాన్ని తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ఇటీవల విడుదల చేసిన ఆడియో సందేశంలో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయినప్పటి నుండి, అతను తన బాధ్యతలను, స్థానాన్ని ఖాళీగా వదిలేశాడని పేర్కొన్నారు. తాను ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ యొక్క చట్టబద్ధమైన తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నట్లు పేర్కొన్నారు. తాను ఇంకా దేశం లోపలే ఉన్నట్లు తెలిపారు. తాలిబాన్ల పై పోరాడటానికి ఆఫ్ఘనిస్తాన్ నాయకులందరినీ అమ్రుల్లా సలేహ్ సంప్రదించారు. తాలిబన్ల అవమానాలలో భాగం కావడానికి తాను సిద్ధంగా లేనని వెల్లడించారు. తాను తన దేశం కోసం నిలబడ్డానని, యుద్ధం ముగియలేదని సలేహ్ ప్రకటించారు.

అమరుల్లా సలేహ్ ఎవరు?

అక్టోబర్ 1972 లో పంజ్‌షీర్‌లో తాజిక్ జాతి కుటుంబంలో జన్మించిన అమ్రుల్లా సలేహ్ చిన్న వయస్సులోనే అనాథగా మారారు.
అహ్మద్ మసౌద్ నాయకత్వంలో తాలిబాన్ల దాడికి వ్యతిరేకంగా పోరాడటానికి కూటమి గతంలో ఏర్పడింది. కూటమి సభ్యులు, ఇతర తాలిబాన్ వ్యతిరేక నాయకుల కలయికతో ‘ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్’ రూపుదిద్దుకుంది. అదే పంజ్‌షీర్ రెసిస్టెన్స్. ఆయన మరణం తర్వాత పంజ్‌షీర్ ప్రావిన్స్ కు అహ్మద్ షా మసౌద్ కుమారుడు అమ్రుల్లా సలేహ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన చిన్న వయస్సులోనే ఉద్యమంలో చేరాడు. అమ్రుల్లా సలేహ్ వ్యక్తిగతంగా తాలిబాన్ల చేతిలో నష్టపోయారు. సలేహ్ సోదరి 1996 లో తాలిబాన్ యోధులచే చిత్రహింసలకు గురై మరణించింది.

ఉత్తర కూటమిలో భాగంగా తాలిబాన్లను ఓడించడానికి సలేహ్ పోరాడాడు. 1997లో తజికిస్థాన్‌లోని దుషాన్‌బేలోని ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయంలో యునైటెడ్ ఫ్రంట్ యొక్క అంతర్జాతీయ అనుసంధాన కార్యాలయానికి నాయకత్వం వహించడానికి సలేహ్ నియమించబడ్డాడు. అక్కడ ప్రభుత్వేతర సంస్థలకు సమన్వయకర్తగా, విదేశీ గూఢచార సంస్థలకు అనుసంధాన భాగస్వామిగా పనిచేశాడు.

అమరుల్లా సలేహ్ – గూఢచారి

అమెరికాలో 9/11 దాడి తర్వాత ఆఫ్ఘన్ యుద్ధంలో అమెరికా ప్రవేశించే వరకు ఉత్తర కూటమి ప్రతిఘటనలో భాగంగా అమృల్లా కొనసాగారు. ఆయన సిఐఎ యొక్క ముఖ్య ఆస్తిగా మారాడు. తాలిబాన్ పాలనను పడగొట్టడానికి యునైటెడ్ ఫ్రంట్ యొక్క నిఘా కార్యకలాపాలకు నాయకత్వం వహించాడు. తాలిబాన్లను తరిమికొట్టిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలలో అనేక ముఖ్యమైన పాత్రలను పోషించడానికి ఆయన నేపథ్యం సుగమం చేసింది. 2004లో కొత్తగా ఏర్పడిన ఆఫ్ఘనిస్తాన్ గూఢచార సంస్థ, నేషనల్ సెక్యూరిటీ డైరెక్టరేట్ కు సలేహ్ అధిపతి అయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ లోపల, పాకిస్తాన్ సరిహద్దులో తాలిబాన్లకు మద్దతు ఇస్తున్న అన్ని తీవ్రవాద నెట్‌వర్క్‌లకు వ్యతిరేకంగా నిఘా సేకరించడానికి శ్రమించారు.

రాజకీయ నాయకుడిగా ప్రస్థానం

2010 జూన్ 6న నేషనల్ పీస్ జిర్గాపై తీవ్రవాద దాడి తరువాత సలేహ్ ఆఫ్ఘనిస్తాన్ గూఢచార సంస్థ, నేషనల్ సెక్యూరిటీ డైరెక్టరేట్ పదవికి రాజీనామా చేశాడు. తాలిబన్లు అప్పటి ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ను సంప్రదించారని చర్చల కోసం సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ఇది తాలిబన్లు పన్నిన ఉచ్చుగా సలేహ్ సున్నితంగా హెచ్చరికలు చేశాడు. 2011లో హమీద్ కర్జాయ్‌ విధానాలపై సలేహ్ వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించాడు. అధ్యక్షుడి విధానాలను, ముఖ్యంగా భద్రతా పరిస్థితులను ఎదుర్కోవడంలోను, అవినీతి ఆరోపణలతో తీవ్రంగా విమర్శించాడు.

అనంతరం బసెజ్-ఇ మిల్లీ (జాతీయ ఉద్యమం)ను సలేహ్ స్థాపించాడు. దీనిని ఆఫ్ఘనిస్తాన్ గ్రీన్ ట్రెండ్ అని కూడా పిలుస్తారు, ఇది రాజకీయ వ్యవస్థలోకి ప్రవేశించడానికి దారితీసిన ఉద్యమంగా చెప్పొచ్చు. అనంతరం ఆయన అష్రఫ్ ఘనీతో చేతులు కలిపాడు. 2014 సెప్టెంబర్ లో ఘని మొదటిసారి అధికారంలోకి వచ్చారు. సలేహ్‌ను అంతర్గత మంత్రిగా ఘనీ నియమించారు. 2019లో అష్రఫ్ ఘనీ తిరిగి ఎన్నిక కావడంతో, సలేహ్ ఆఫ్ఘనిస్తాన్ మొదటి వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.

లీడర్ నుండి ఫైటర్ గా..

సలేహ్ ప్రపంచం పూర్తిగా మరలా మొదటికి వచ్చింది. ప్రతిఘటన ఉద్యమాన్ని పంజ్‌షీర్‌లో ఆయన బుధవారం ప్రారంభించాడు. ఆయన ఏకైక గురువు అహ్మద్ షా మసౌద్ బాటలో తాలిబాన్‌లకు ఎప్పటికీ తలవంచనని ప్రతిజ్ఞ చేశాడు. పంజ్‌షీర్‌ నుంచే ఆఫ్ఘనిస్థాన్ ను
తాలిబన్ల నుంచి విముక్తి చేయడానికి పోరాటం ప్రారంహించాడు.

Previous articleవాట్సాప్ డేటా.. 90 రోజులలో ఆటోమేటిక్ డిలీట్
Next articleక్రిప్టో కరెన్సీ బిల్లు సిద్ధం చేసిన కేంద్రం