Home జాతీయ వార్తలు అమెజాన్ ఫ్లిప్‌కార్ట్ పిటిషన్ కొట్టేసిన సుప్రీం కోర్టు

అమెజాన్ ఫ్లిప్‌కార్ట్ పిటిషన్ కొట్టేసిన సుప్రీం కోర్టు

482
0
Supreme Court Refuses To Halt Antitrust Probe Against Flipkart, Amazon
Supreme Court Refuses To Halt Antitrust Probe Against Flipkart, Amazon

అమెజాన్ ఫ్లిప్‌కార్ట్ పిటిషన్ కొట్టేసిన సుప్రీం కోర్టు తమపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) విచారణను నిలిపివేయాలని కోరుతూ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టేసింది. సిసిఐ విచారణను నిలిపివేయడానికి వీల్లేదంటూ సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఎంపిక చేసిన విక్రేతలను మాత్రమే వారి ఇ -కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రోత్సహించడం, ఇతరులను ముఖ్యంగా చిన్న వ్యాపారులను అణిచివేసే వ్యాపార పద్ధతులను ఉపయోగించడం, సంక్లిష్ట వ్యాపార నిర్మాణాలను సృష్టించడం వంటి చర్యల ద్వారా ఈ రెండు అగ్ర వ్యాపార సంస్థలు భారతదేశ చట్టాలను ఉల్లంఘించినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనిపై గత సంవత్సరం సిసిఐ దర్యాప్తును ఆదేశించింది.

ఈ విచారణతో రెండు ఇ-కామర్స్ దిగ్గజాలు, ప్రభుత్వానికి మధ్య బహిరంగ విభేదాలు తలెత్తాయి. ఫలితంగా అనేక చట్టపరమైన సవాళ్లను ఈ రెండు వ్యాపార సంస్థలు ఎదుర్కొన్నాయి.సిసిఐ తన విచారణకు ఆదేశించే ముందు కనీస ఆధారాల కోసం అంతర్గత ప్రమాణాలను పాటించలేదని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పిటిషన్ లో పేర్కొన్నాయి. అయితే, ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వాదనలతో ఏకీభవించలేదు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లు రెండూ పెద్ద సంస్థలనీ, విచారణ, పారదర్శకత కోసం స్వచ్ఛందంగా ముందుకు రావాలని కూడా పేర్కొంది.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు సిసిఐ విచారణను రద్దు చేయాలన్న పిటిషన్లను కర్ణాటక హైకోర్టు గత నెలలో తోసిపుచ్చింది. ఆ తర్వాత వాల్‌మార్ట్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమపై విచారణను నిలిపివేయడానికి ఆయా సంస్థల ప్రయత్నాలకు కోర్టు తీర్పు పెద్ద ఎదురుదెబ్బ అని పలువురు పేర్కొంటున్నారు. సిసిఐ తన దర్యాప్తులో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌కు 32 “సున్నితమైన” ప్రశ్నలను సంధించింది. ఇందులో ఎక్కువ మొత్తంలో జరిగిన విక్రయదారుల జాబితా, ఆన్‌లైన్ డిస్కౌంట్ల వివరాలు, స్మార్ట్‌ఫోన్ తయారీదారులతో ఒప్పందాల గురించి అడిగింది. ఇది జరిగిన కొన్ని రోజులకు ఫ్లిప్‌కార్ట్ సంస్థ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఒక రోజు తర్వాత అమెజాన్ కూడా సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది.

Previous articleManga fruit for bodyguard
Next articleబూస్టర్ డోస్‌తోనే కరోనాకు అడ్డుకట్ట : ఆంటోనీ ఫౌచీ