Home Andhra Pradesh అంతర్రాష్ట్ర ప్రాజెక్టులను జాతీయం చేసేయండి : సుప్రీం కోర్టుకు ఏపీ సర్కారు

అంతర్రాష్ట్ర ప్రాజెక్టులను జాతీయం చేసేయండి : సుప్రీం కోర్టుకు ఏపీ సర్కారు

323
0
River Water Conflict between AP and Telangana
River Water Conflict between AP and Telangana

కృష్ణా జలాల విషయంలో తమ విజ్ఞప్తులను కృష్ణ రివర్ బోర్డు పరిష్కరించక పోవడం, ప్రధాని మోడీకి లేఖ రాసిన స్పందన లేకపోవడం తో చివరికి సుప్రీమ్ కోర్టు తలుపు తట్టేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. Get more at play free pokies online nz. వివాదం పరిష్కారమయ్యే సూచలను లేకపోవడంతో అంతర్రాష్ట్ర నదీ జలాలపై నిర్మించిన ప్రాజెక్టులను జాతీయం చేసేయాలని కోరుతోంది. ఈ క్రమంలో న్యాయ నిపుణులతో ఏపీ సర్కారు మంతనాలు సాగిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

Nagarjuna Sagar Dam

శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల రిజర్వాయర్ల వద్ద పొరుగు రాష్ట్రం తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తున్న వైనంపై ఏపీ నుంచి అభ్యంతరాలు వచ్చాయి. దీనిపై కృష్ణా రివర్ బోర్డుకు ఆ రాష్ట్ర సర్కారు లేఖ రాసింది. అనంతరం సమస్య పరిష్కరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కూడా లేఖ రాసింది. తమ సాగునీటి అవసరాలను పట్టించుకోకుండా తెలంగాణ ముందుకెళ్తోందని, విద్యుత్ ఉత్పత్తి పేరుతో ఆ రాష్ట్రం చేస్తున్న నీటి వృధాను అరికట్టేలా చూడాలని ప్రధానికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేసింది. నీటి వివాదాలపై జోక్యం చేసుకోవాలని ఏపీ సర్కారు చేసిన విజ్ఞప్తికి నేటికీ పరిష్కారం లభించలేదు. దీనితో సుప్రీం తలుపు తట్టేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఏపీ జలవనరుల శాఖా అధికార గణం ఈ అంశంపై న్యాయ నిపుణులతో ముమ్మర మంతనాలు సాగిస్తున్నారు. ఏపీ రైతుల సాగునీటి అవసరాలను పణంగా పెట్టేది లేదని, తమ రాష్ట్ర నీటి హక్కులపై ఎంతకైనా పోరాడుతామని తేల్చి చెబుతోంది.

పరిష్కారమెలా..
రాష్ట్రం విడిపోయిన తరువాత నీటి వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నట్లు అప్పట్లో పలువురు సాగునీటి రంగ నిపుణులు, రాజకీయ నేతలు చెప్పారు. అయితే ప్రస్తుతం ఏపీలో జగన్, తెలంగాణాలో కెసిఆర్ మధ్య సఖ్యత ఉండడంతో నీటి పంపకాలపై వివాదాలు ఉత్పన్నం కావని అందరూ భావించారు. తొలుత ఇరు రాష్ట్రాల బంధాలు సజావుగా సాగినా, ప్రస్తుత పరిస్థితులు అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. గోదావరి, కృష్ణా నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మీ ప్రాజెక్టులు అక్రమం అంటే కాదు మీవే అంటూ ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. అయితే ఇరు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకుంటే తప్ప సమస్యలు పరిష్కారం కావని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Previous articleపడక సుఖం అందించలేవు అనడంతో..
Next articleసెప్టెంబర్ నుంచి సీరంలో స్పుత్నిక్ ఉత్పత్తి