Home Technology అంతరిక్షాన్ని చుట్టొచ్చిన ప్రపంచ కుబేరుడు

అంతరిక్షాన్ని చుట్టొచ్చిన ప్రపంచ కుబేరుడు

297
0
Jeff Bezon Space Tour 1
Jeff Bezon Space Tour 1

అంతరిక్ష విహారంలో మంగళ వారం సరికొత్త విప్లవం ఆవిష్కృతమైంది. ప్రపంచ కుబేరుడు, అమెజాన్ మాజీ సీఈవో జెఫ్‌ బెజోస్‌, మరో ముగ్గురితో కూడిన బృందం “న్యూ షెపర్డ్” వ్యోమ నౌక ద్వారా అంతరిక్షంలోకి వెళ్లి సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు, రోదసీలో తేలియాడే కాలనీలను ఏర్పాటు చేసేందుకు “బ్లూ ఆరిజిన్” సంస్థను జెఫ్ బెజోస్ స్థాపించారు. ఈ నేపథ్యంలో ఆయన తన సోదరుడితో పాటు మరో ఇద్దరు నేడు రోదసీలోకి వెళ్లొచ్చారు. మరో కుబేరుడు బ్రాస్నన్ తన సొంత వ్యోమ నౌక వర్జిన్‌ గెలాక్టిక్‌ ద్వారా ఇటీవలే ప్రప్రథంగా అంతరిక్ష యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఇటువంటి చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైన కొన్ని రోజులకే ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ ‘బ్లూ ఆరిజిన్‌’ యాత్ర కూడా సఫలం కావడం చరిత్రలో మరుపురాని ఘట్టంగా లిఖించబడింది.

యాత్ర చేపట్టారిలా…
యూఎస్ లోని టెక్సాస్‌ ఎడారిలో మంగళవారం సాయంత్రం వీరి యాత్ర ప్రారంభమైంది. సాయంత్రం 6:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) న్యూ షెపర్డ్‌ నింగిలోకి దూసుకెళ్లింది.
ఇది నింగిలోకి వెళ్లే క్రమంలో ‘న్యూ షెపర్డ్‌’ గంటకు 3700 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించినట్లు సమాచారం. ఈ క్రమంలో భూమి మీద కంటే ఎక్కువగా, సుమారు మూడు రెట్లు అధికంగా గురుత్వాకర్షణ శక్తికి గురయ్యారు. అనంతరం రాకెట్ లో ప్రయాణిస్తున్నవారు తమ సీట్ బెల్టులు తొలగించి, అంతరిక్ష యానాన్ని ఆస్వాదించారు.
సుమారు 15 ని. పాటు వీరి రోదసీ యాత్ర సాగింది. ఇందులో పాల్గొన్న నలుగురూ విజయవంతంగా తిరిగి భూమికి చేరుకున్నారు. లాంచింగ్ పాడ్ నుంచి 3.2 కి.మీ. దూరంలోని నిర్ధేశిత ప్రదేశంలో వీరు సురక్షితంగా దిగారు. అమెజాన్ మాజీ సీఈఓ జెఫ్ బెజోస్, ఆయన సోదరుడు మార్క్ బెజోస్, వ్యాలీ ఫంక్, ఆలివర్ డ్యామన్ లు ఉన్నారు. అతి చిన్న వయసులో అంతరిక్ష యాత్ర చేపట్టిన వ్యక్తిగా ఆలివర్ డ్యామన్ (18) నిలిచారు.

Previous articleఇందుకే.. మీతో ప్రేమలో పడతారు.!
Next articleగురుకుల పాఠశాలల్లో ఉద్యోగాలు